News January 11, 2025
తెనాలి: సైనేడ్ కిల్లర్స్ మరోసారి అరెస్ట్

సైనేడ్ హత్యకేసుల్లో నిందితులను 3 టౌన్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. యడ్ల లింగయ్యకాలనీకి చెందిన వెంకటేశ్వరి, తల్లి రమణమ్మలు సైనేడ్‌తో హత్యలు చేసిన కేసులో బెయిల్‌పై వచ్చారు. ఇదే కాలనీకి చెందిన మోషే మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఖననం చేసిన ప్రాంతంలో శవాన్ని తీసి పోస్ట్‌మార్టం చేశారు. సైనేడ్ వలనే మోషే మృతిచెందినట్టు తేలగా తల్లి, కూతుర్లను అరెస్టు చేశారు.
Similar News
News November 28, 2025
ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్‌ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
News November 27, 2025
అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తాం’

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్‌కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.
News November 27, 2025
పోలీసు కుటుంబాలకు అండగా గుంటూరు ఎస్పీ

గుంటూరు AR హెడ్ కానిస్టేబుల్ షేఖ్ మొహిద్దిన్ బాషా కుమారుడు షేఖ్ ఆఖ్యార్ అహ్మద్ సాఫ్ట్ టెన్నిస్‌లో దేశస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. శ్రీకాకుళంలో అండర్-17 టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించిన అతనికి ఎస్పీ వకుల్ జిందాల్ ప్రోత్సాహకంగా రూ. 20 వేల విలువైన టెన్నిస్ బ్యాట్ అందజేశారు. పోలీసు కుటుంబం నుంచి జాతీయ స్థాయికి చేరడం గర్వకారణమని ఎస్పీ పేర్కొంటూ, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.


