News May 21, 2024
తెర్లం: గంజాయితో ఆరుగురు అరెస్ట్

గంజాయతో పట్టుబడిన ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై ఆర్.రమేశ్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలో రంగప్పవలస చెరువు దగ్గర ఒడిశా రాష్ట్రం నుంచి 2.193 కిలోల గంజాయి తీసుకువస్తుండగా యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, ఈ కేసు బొబ్బిలి సీఐ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News April 23, 2025
VZM: భార్గవ్, భార్గవ ఇద్దరూ ఇద్దరే..!

యూపీఎస్సీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సివిల్స్కు విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్(455వ ర్యాంక్) కాగా మరొకరు రాజాం మండలం సారధి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్(830వ ర్యాంక్) ఉన్నారు. భార్గవ్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉండగా, భార్గవ స్టేట్ టాక్స్ అధికారిగా ఉన్నారు.
News April 23, 2025
ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.