News February 10, 2025

తెర్లాంలో యువతితో అసభ్య ప్రవర్తన

image

తెర్లాంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి, దూషించిన ఘటనలో కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ బాబు తెలిపారు. వారి కథనం.. తెర్లాంకు చెందిన యువతి జి.సిగడాంలో చదువుకుంటోంది. సెలవు ఉండడంతో ఇంటికి వచ్చినప్పుడు కిరణ్ తప్పుగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదుతో శనివారం కేసు నమోదైంది.

Similar News

News February 8, 2026

భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక ఆదివారం కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం వంటి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ గావించి శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.

News February 8, 2026

SRK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘కింగ్’ తర్వాత రెండేళ్లు సెలవు?

image

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అప్ కమింగ్ మూవీ ‘కింగ్’ రిలీజ్ తర్వాత ఆయన రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వరుస షూటింగ్స్, స్టంట్స్ వల్ల భుజం గాయంతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుండటమే దీనికి కారణం. బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హెల్త్ సెట్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘కింగ్’ తర్వాత స్క్రీన్‌పై SRKని చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

News February 8, 2026

WGL: అన్నా.. ఏమైందే నా ఓటు నీ వార్డులోనే ఉంది!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. కొందరు ఓటర్లు తమ ఓటు అదే వార్డులో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికల వేళ ఓటు వ్యాపారం చర్చనీయాంశంగా మారింది.