News November 3, 2024

తెలంగాణకు స్లీపర్ వందే భారత్ తీసుకువస్తాం: కిషన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్రానికి స్లీపర్ వందే భారత్ రైలును సైతం తీసుకువస్తామని HYDలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD నగరంలో చర్లపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

Similar News

News December 15, 2025

ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

image

ఫేస్- 1, ఫేస్-2 ఎన్నికల్లో గైర్హాజరైన 125 మంది పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కొంత మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరై రిజిస్టర్‌లో సంతకాలు చేసి, విధులు నిర్వహించకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మూడవ విడతలో ఎవరైనా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉంటే సస్పెండ్ చేస్తానని ఆయన తెలిపారు.

News December 14, 2025

చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

image

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

News December 14, 2025

చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

image

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.