News November 3, 2024
తెలంగాణకు స్లీపర్ వందే భారత్ తీసుకువస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి స్లీపర్ వందే భారత్ రైలును సైతం తీసుకువస్తామని HYDలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD నగరంలో చర్లపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
Similar News
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.
News November 23, 2024
HYD: WOW.. అందర్నీ ఆకట్టుకున్న రచన
హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.