News January 1, 2025
తెలంగాణలోనే మన రంగారెడ్డి TOP

తెలంగాణ రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని TGFDS తెలిపింది. అంతేకాక అత్యధిక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. RR జిల్లాలోని యాచారం, మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా అనేక ప్రాంతాల నుంచి పాడి రైతులు పాల వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు తెలిపింది. HYD నగరం రంగారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉండటం గొప్ప వరంగా అభిప్రాయపడింది.
Similar News
News July 11, 2025
జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.
News July 9, 2025
కూకట్‌పల్లి: కల్తీ కల్లు ఘటనలో నలుగురి మృతి

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు తులసీ రామ్, చాకలి బొజయ్య, నారాయనమ్మ, స్వరూప (56)తో కలిపి నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లు తాగడంతో నిన్న సాయంత్రం నుంచి అస్వస్థతకు గురై 19 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితులందరినీ నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆమె మృతి చెందింది. మృతుల సంఖ్య పెరగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.