News April 16, 2025
తెలంగాణలో కొత్తూరు వాసి ఆకస్మిక మృతి

కొత్తూరు మండలానికి చెందిన కూన చిరంజీవులు(57) తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురం ఏరియా డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత స్నేహితులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం ముగించుకుని సేద తీరేందుకు కుర్చీలో కూర్చుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
News April 19, 2025
సోంపేట: బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జెసీ, ఆర్డీఓ తదితరులు ఉన్నారు.
News April 18, 2025
టెక్కలిలో చారిత్రాత్మక కట్టడాలలో కొన్ని ఇవే..

టెక్కలి చరిత్ర తెలిసే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం పూర్వం టెక్కలిలో రాజుల పరిపాలనలో ఉన్న రాజుగారి కోట, కోట భవనాలు, మిస్సమ్మ బంగ్లా, పురాతన ఆలయాలు టెక్కలిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం సీతానగరం వద్ద బ్రిటీష్ కాలం నాటి ముసళ్ల ఖానా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మండు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. WORLD HERITAGE DAY