News March 6, 2025
తెలంగాణలో చిత్తూరు యువకుడు సత్తా

తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా నిలిచాడు. ఇతను ఎస్వీయులో డిగ్రీ చదువుతున్నాడు. పోటీల్లో ప్రతిభ చాటిన మౌనిశ్‌ను బుధవారం స్థానిక టీడీపీ నేతలు మునస్వామి, నాగభూషణం, పట్ర నారాయణ, జయశంకర్, మునిరత్నం తదితరులు అభినందించారు.
Similar News
News March 6, 2025
చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం SI రాజ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని ఇవాళ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని SP అభినందించారు.
News March 6, 2025
నిధులకు కొరత లేదు: చిత్తూరు కలెక్టర్

వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పంచాయతీల వారీగా తాగునీటి సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు.
News March 5, 2025
చిత్తూరు: లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు బుధవారం నిర్వహించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మహిళా, పురుష సమానత్వంపై అవగాహన పెంచేలా పోటీలు ఉపయోగపడతాయన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయాన్ని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈనెల 8 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు.