News April 12, 2025
తెలంగాణలో టాప్ 3లో ఉమ్మడి ADB

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4350 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 13, 2025
ఆదిలాబాద్: రేపే పోలింగ్.. ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే

ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 2వ విడత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, హత్తిగుట్ట, చాంద్ పల్లి, అడ, పూసాయి, మార్కగూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్, పార్డి (బి), జంబుల్ దరి, లింగు గూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.
News December 13, 2025
పోలింగ్‌కు పగడ్బందిగా ఏర్పాట్లు: ఆదిలాబాద్ కలెక్టర్

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాత్నాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహశీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2025
ఆదిలాబాద్: ‘బెదిరింపులకు పాల్పడితే చెప్పండి’

తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వస్తువులను వినియోగదారులు పరిశీలించి కొనాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలన్నారు. అధ్యక్షుడు దినేష్ ఉన్నారు.


