News April 12, 2025
తెలంగాణలో టాప్ 3లో ఉమ్మడి ADB

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 27, 2026
ADB: సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం రెండో విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ధ్రువపత్రాలను, లైసెన్స్‌లను అందజేశారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
News February 27, 2026
ఆదిలాబాద్: నేర నియంత్రణకు సమన్వయ చర్యలు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రామస్థాయి సమాచార వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు-చిన్నారుల రక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ అక్క-ఖాకీ కిడ్స్ ద్వారా అవగాహన పెంచాలని ఆదేశించారు.
News February 27, 2026
ఉట్నూర్: గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు: హుస్సేన్ నాయక్

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని కుమ్మరి గుంట, కామయి పేట్ పసుపుల గ్రామాల్లో పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి పర్యటించారు. గిరిజనుల స్థితిగతులను పరిశీలించారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం ద్వారా అర్హులైన గిరిజనులకు పథకం ఫలాలు అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు.


