News April 3, 2025
తెలంగాణలో తొలి ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ మార్షల్స్

సైబరాబాద్లో జరీనా, విశాలాక్షి, అనూష, ప్రభ, వాసుప్రియ తొలిసారిగా ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ మార్షల్స్గా నియమితులయ్యారు. డీసీపీ సృజన కర్నం ఆధ్వర్యంలో ఎంపిక జరిగిందని, ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాటం కొనసాగాలని ఆక్టివిస్ట్ చంద్రముఖి మువ్వలా అన్నారు. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News April 11, 2025
వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎంపీ కావ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
News April 11, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.
News April 11, 2025
PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.