News January 11, 2026
తెలంగాణలో ప్రమాదం.. కడప జిల్లా దంపతులు మృతి

కడప జిల్లాకు చెందిన శేషయ్య (72), నవనీతమ్మ (64) దంపతులు తెలంగాణలోని భూత్పూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. SI చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడిని కలిసి కారులో తిరుపతి వెళ్తుండగా, వెనుక నుంచి మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News January 20, 2026
లింగంపేట: ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

లింగంపేటకు చెందిన యాదగిరి పలువురు నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకే ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గతంలో గ్రూప్-4 ఉద్యోగం సాధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే ఇటీవల విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లో జిల్లా ట్రెజరీ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించి ఆర్డర్ కాపీ అందుకున్నారు.
News January 20, 2026
MHBD: సీఎం కప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘చీఫ్ మినిస్టర్ కప్ – 2025’ క్రీడా పోటీలు నిర్వాహించనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ తెలిపారు. https://satg.telangana.gov.in/cmcup /signup లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
News January 20, 2026
ఖమ్మం మార్కెట్‌లో ‘మిర్చి’ ఘాటు.. పత్తి ధరకూ రెక్కలు!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ.8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా, మార్కెట్ ఛైర్మన్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.


