News February 2, 2025
తెలంగాణ అంటే బీజేపీకి చిన్న చూపు: హరీశ్ రావు

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని ఎమ్మెల్యే హరీశ్ రావు కేంద్రంపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశమంటేనే మొదటి నుంచి బీజేపీకి చిన్నచూపని విమర్శించారు. గతంలో కూడా దేశంలో 142 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదని, మెడికల్ పీజీ విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు.
Similar News
News February 7, 2025
నల్గొండ: ఎమ్మెల్సీగా ఆర్వ స్వాతి నామినేషన్ దాఖలు

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థిగా మాజీ సర్పంచ్ అర్వ స్వాతి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిడమనూరు మండలం వేం పహాడ్ గ్రామ మాజీ సర్పంచ్‌గా ఆమె పని చేశారు. కాగా గతంలో ఉత్తమ గ్రామ అవార్డు పొందారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు.
News February 7, 2025
కాళ్ల: స్థల వివాదమే హత్యకు కారణం

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటనకు స్థలం గొడవే కారణంగా తెలుస్తోంది. తమ తల్లికి చెందిన సెంటు స్థలం కోసం అన్న రమేశ్, తమ్ముడు సత్యనారాయణ మధ్య వివాదం నడుస్తోంది. 2023లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని రాజీ పడ్డారు. ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం అన్న ఇంటికి వెళ్లి రమేశ్ గొడవపడ్డాడు. సత్యనారాయణ తలపై బలంగా కొట్టడంతో రమేశ్ మృతి చెందాడు. కేసు నమోదైంది.
News February 7, 2025
ఇకపై లేఖర్ల అవసరం లేదు: డీఐజీ

ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఇకనుంచి లేఖర్లు అవసరం లేదని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆస్తి కొనుగోలుదారులు చలానా తీసిన వెంటనే అన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.