News March 28, 2025
తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.
Similar News
News December 20, 2025
టీ20 ప్రపంచకప్ జట్టులో మన హైదరాబాదీ

భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. పొట్టి ఫార్మాట్లో 68 సగటుతో కోహ్లీ రికార్డును దాటేసిన తిలక్ ఎంపికపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.
News December 20, 2025
HYD: 600 స్పెషల్ ట్రైన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదని బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే.. సంక్రాంతి సందర్భంగా మొత్తం 600 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్నామన్నారు. ఇప్పటికే 124 రైళ్లు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరింకెందుకు ఆలస్యం బుక్ చేసుకోండి మరి.
News December 20, 2025
HYD: డివిజన్ల పేర్ల మార్పుపై సెంటిమెంట్‌కే పెద్దపీట

పునర్విభజనలో భాగంగా అధికారులు కొన్ని డివిజన్ల పేర్లను మార్చారు. మరి కొన్ని డివిజన్లు అసలు లేనేలేవు. దీంతో వేలమంది తమ డివిజన్ పేరు మారిస్తే ఎలా? పేరు లేకపోతే ఎలా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ సభ్యులు ఈ విషయం లేవనెత్తారు. దీంతో ప్రజల సెంటిమెంటును గౌరవించి పాతపేర్లనే కొనసాగించనున్నట్లు తెలిసింది.


