News December 14, 2024
తెలంగాణ- ఆంధ్ర చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు
కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో ఆంధ్ర – తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు బోనస్ ధర ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు.
Similar News
News January 25, 2025
NLG: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సహాయం కొరకు వివిధ రకాల దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు tsobmms.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 25, 2025
హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
గ్రామీణ, గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం .శివాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ అనే పథకంలో భాగంగా పర్యాటక, గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
News January 24, 2025
ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం: ఇలా త్రిపాఠి
ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుంచి విద్యార్దినులు, మహిళలుతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్‌ను విడుదల చేశారు.