News May 18, 2024

తెలంగాణ ఈఏపీ సెట్‌లో చిత్తూరు విద్యార్థుల ప్రభంజనం

image

తెలంగాణలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంకు మదనపల్లికి చెందిన ప్రణీత కైవసం చేసుకుంది. కాగా నాల్గవ ర్యాంకులో చిత్తూరులోని మల్లేశ్వరపురానికి చెందిన సోంపల్లి సాకేత్ రాఘవ్ నిలిచారు. అలాగే తిరుపతికి చెందిన వడ్లపూడి ముఖేశ్ చౌదరి 7వ ర్యాంకు సాధించారు.

Similar News

News December 7, 2024

టీటీడీ చైర్మన్‌ను కలిసిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు

image

టీటీడీ చైర్మన్‌ను శాప్ ఛైర్మన్ రవినాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస స్పోర్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ, హాకీ అకాడమీ పునరుద్ధరణకు టీటీడీ తరపున సహాయ సహకారం అందించాలని చైర్మన్‌ను కోరుతూ రవినాయుడు వినతిపత్రం ఇచ్చారు. రవినాయుడు వినతిపై టీటీడీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు, క్రీడాకారులకు ఉపయోగకరంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఛైర్మన్ ఇచ్చారన్నారు.

News December 6, 2024

CTR : 10వ తేదీన జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో 10వ తేదీన చిత్తూరు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 6, 2024

పుష్ప-2తో తిరుపతిలో ట్రెండ్ మారుతోంది..!

image

తిరుపతి గంగమ్మ జాతరలో భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషంతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇందులో మాతంగి వేషం కీలకమైంది. మగవారు ఆడవారిలా తయారు కావడమే ఈ వేషం ప్రత్యేకత. పుష్ప-2లో అల్లు అర్జున్ గెటప్ రిలీవ్ కాకముందు సాధారణంగా వేషాలు వేసేవారు. పుష్ప మేనియాతో అందరూ అదే తరహాలో వేషం వేస్తున్నారు. గత జాతరలో MP గురుమూర్తి సైతం ఇలాగే వేషం వేయడం విశేషం. మరి రానున్న జాతరలో ఎంత మంది పుష్పలాగా కనిపిస్తారో చూడాలి మరి.