News February 16, 2025

‘తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గం’ పుస్తకావిష్కరణ

image

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసాలో తెలంగాణ తెలుగు కళానిలయం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గము, బాల రామ శతకం పుస్తకావిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముధోల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భాగస్వాములై ఉద్యమానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు.

Similar News

News October 19, 2025

యాప్‌ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

image

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్‌లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.

News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

image

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.

News October 19, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.