News October 9, 2024
తెలంగాణ డీఎస్సీలో సత్తా చాటిన తర్లుపాడు యువతి
తెలంగాణ డీఎస్సీలో తుర్లపాడుకు చెందిన సయ్యద్ రహిమున్ సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. దీంతో నాన్ లోకల్ కేటగిరీ కింద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని (ఉర్దూ) గా ఎంపికయ్యారు. తండ్రి టైలర్ కాగా తల్లి గృహిణి. పట్టుదలతో తెలంగాణలో ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
Similar News
News November 1, 2024
పొదిలి: రెండు ఆటోలు ఢీ.. పలువురికి గాయాలు
పొదిలి – మార్కాపురం రోడ్డులో రెండు ఆటోలు ఢీకొన్న ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం నుంచి పొదిలి వైపుగా వెళుతున్న ఆటోను పొదిలి నుంచి మార్కాపురం వైపుకు వస్తున్న ఆటో ఒకదాన్ని మరొకటి ఎదురుగా ఢీకొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2024
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పోలీసుల నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాపోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
News October 31, 2024
YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
ఆస్తుల గొడవలతో పెద్దాయన(YS) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YS ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈదోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. ఆయన అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ల ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనవిగా ఎలా మారాయి’ అని ప్రశ్నించారు.