News September 3, 2024
తెలంగాణ పాఠశాల విద్యపై మంత్రికి రిపోర్టు

తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(TDF) రూపొందించిన రిపోర్టును రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, MP కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డిలకు చైర్మన్ గోనారెడ్డి సమర్పించారు. అలాగే ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంలకు కూడా రిపోర్టును అందజేశారు.
Similar News
News November 23, 2025
HYD: వీకెండ్ పార్టీ.. రోడ్డెక్కితే దొరికిపోతారు!

వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్లు, పబ్లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల మంది పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D & D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా తనిఖీల్లో దొరికి తలలు పట్టుకుంటున్నారు.
News November 23, 2025
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్’ను చార్మినార్లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
News November 23, 2025
HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్ఖాన్పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.


