News April 9, 2025
తెలంగాణ పేరును కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారు: హరీశ్ రావు

తెలంగాణ పేరును 10ఏళ్ల పాలనలో కేసీఆర్ దేశవ్యాప్తంగా నిలబెడితే సంవత్సర పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పడగొట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేసీఆర్ మొక్కలు నాటితే ఇప్పుడు పెరిగిన చెట్లను రేవంత్ రెడ్డి కొట్టేస్తున్నారన్నారు.
Similar News
News January 4, 2026
ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
News January 4, 2026
మెదక్: ‘ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
News January 4, 2026
రేపు బీఆర్ఎస్ PPT

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన చర్చకు కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట PPT ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీటి కేటాయింపుల్లో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి అన్యాయం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.


