News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఆదిలాబాద్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్‌కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News March 22, 2025
ADB: హమాలీల సమస్యలు, లైసెన్స్‌లపై కలెక్టర్ సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హమాలీల సమస్యలు, లైసెన్స్‌లపై శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించి కమిటీతో చర్చించారు. వ్యవసాయ కమిటీల్లో హమాలీలకు కొత్తగా లైసెన్సులు ఇచ్చేందుకు జిల్లా స్థాయి సమీక్షా నిర్వహించారు. హమాలీ లైసెన్సులు జారీ చేసేందుకు పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియను మార్చి చివరిలోగా పూర్తి చేయాలని వ్యవసాయ కమిటీల అధికారులను ఆదేశించారు.
News March 22, 2025
రాష్ట్రపతి అల్పాహార విందుకు ఎంపీ నగేష్

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా& నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ ఇతర రాష్ట్రాల కీలక అంశాలపై చర్చించారు.
News March 21, 2025
ఖండాలలో నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.