News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఆసిఫాబాద్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆడా, వట్టివాగు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి నిధుల కేటయించాలని కోరుతున్నారు.
Similar News
News March 15, 2025
ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
News March 15, 2025
వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.
News March 15, 2025
తణుకు: సీఎం సభలో కీ పాయింట్స్.

తణుకులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో కొన్ని కీ పాయింట్స్…
1) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార్క్ శుభ్రం చేశారు.
2) మార్కెట్ వ్యాపారస్తులతో ముఖాముఖి.
3) రాగి పిండితో తయారుచేసిన కప్పులను తిలకించారు.
4) తణుకులో 42 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
5) అక్టోబర్ 2న చెప్పకుండా వస్తా అన్నారు.
6) ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్.