News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Similar News
News March 25, 2025
KNR: BJP స్టేట్ చీఫ్‌గా ఎంపీ ఈటల రాజేందర్?

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.
News March 25, 2025
కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో అనేక పోరాటాలు విద్యార్థి సంఘ నాయకులు చేశారు. శాతవాహన యూనివర్సిటీకి ఈ రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News March 24, 2025
కరీంనగర్: ప్రజావాణిలో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ అర్జీదారులు

కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.