News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. జనగామ జిల్లా ఎదురుచూస్తోంది!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనగామ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలకుర్తికి 100 పడకల ఆసుపత్రి, జిల్లాలో పెద్ద మొత్తంలో ఇండస్ట్రియల్ పర్క్స్, ఘనపూర్‌కు 100 పడకల ఆసుపత్రి, ముఖ్యంగా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్, చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేసి దిగువ ప్రాంతాలను సాగు, తాగు నీరు అందించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Similar News
News February 11, 2026
జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
News February 11, 2026
రాయికల్: ఖండాంతరాలు దాటి వచ్చి ఓటేసిన యువకుడు

రాయికల్ పట్టణానికి చెందిన సింగని సురేశ్ అనే యువకుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి యూరప్ దేశం నుంచి వచ్చాడు. తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సురేశ్ లీవ్ పెట్టి మరి బుధవారం పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఖండాంతరాలు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సురేశ్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
News February 11, 2026
మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.


