News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. నిర్మల్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కడెం ప్రాజెక్ట్ సుందరీకరణ, గడ్డెన్నవాగు అప్‌గ్రెడేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతుందని.. పర్యాటకంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. కవ్వాల్ అభయారణ్యం, గోదావరి ఎకో టూరిజంను డెవలప్ చేయాలని కోరుతున్నారు.

Similar News

News November 28, 2025

ఏలూరు: మరో మూడు రోజులే గడువు

image

పీఎంఏవై (గ్రామీణ) – ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారు, స్థలం లేని నిరుపేదలు, అసంపూర్తిగా ఇళ్లు ఉన్నవారు ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘ఆవాస్‌ ప్లస్‌’ యాప్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.

News November 28, 2025

వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.

News November 28, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.