News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. నిర్మల్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కడెం ప్రాజెక్ట్ సుందరీకరణ, గడ్డెన్నవాగు అప్‌గ్రెడేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతుందని.. పర్యాటకంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. కవ్వాల్ అభయారణ్యం, గోదావరి ఎకో టూరిజంను డెవలప్ చేయాలని కోరుతున్నారు.

Similar News

News March 25, 2025

బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి 

image

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

News March 25, 2025

మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2025

అచ్చంపేట: వేతనాలు లేక లైబ్రేరియన్ల అవస్థలు..!

image

జిల్లా గ్రంథాలయ శాఖల్లో  పనిచేస్తున్న లైబ్రరియన్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అచ్చంపేట లైబ్రేరియన్ శంకర్  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు లైబ్రేరియన్లు, మరో 15 మంది పార్టీ వర్కర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!