News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. పెద్దపల్లి జిల్లాకు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందుతాయని తెలిపారు. అలాగే జిల్లాలో బస్సు డిపో త్వరగా పూర్తిచేయాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం, సుందిళ్ల రిటరింగ్ ప్రహరీ నిర్మాణం, రామగుండంలో దంత, పాలిటెక్నిక్ కళాశాల, విమానాశ్రమం, అలాగే జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
NRPT: ముగిసిన పోలింగ్.. శుక్రవారమే ఫలితాలు

నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డులకు బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 34,460 ఓట్లకు గాను 22,938 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు, మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు ఫిబ్రవరి 13న (శుక్రవారం) వెలువడనున్నాయి.
News February 11, 2026
భూపాలపల్లి: 65.18 శాతం పోలింగ్ @5PM

భూపాలపల్లి మున్సిపాల్టీలో సాయంత్రం 5 గంటలకు 65.18 శాతం పోలింగ్ నమోదయింది. మున్సిపాలిటీలోని 30 వార్డులు, 86 పోలింగ్ కేంద్రాల్లో 34,367 ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీలో 52,826 మంది ఓటర్లు ఉన్నారు. 17,253 మంది పురుషులు, 17,111 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బంది సీజ్ చేశారు.
News February 11, 2026
నర్సీపట్నంలో సీబీఐ కలకలం

నర్సీపట్నంలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్ రాజేశ్, చార్టెడ్ అకౌంటెంట్ శరత్‌ను CBI అధికారులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాల ట్రస్ట్‌కు సంబంధించి రూ.2 కోట్లు రాజేశ్ వ్యక్తిగత ఖాతాకు మళ్ళించాడు. ఐటీ రిటర్న్‌లో వివరాలివ్వకపోవడంతో ఆ శాఖ అధికారి అభ్యంతరం తెలిపారు. ఆయనకు రూ.14 లక్షల లంచం ఇవ్వడానికి ప్రయత్నించగా సమాచారం అందుకున్న సీబీఐ ఇద్దరినీ
రెండ్రోజుల క్రితం అరెస్ట్ చేసింది.


