News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ములుగు జిల్లా ఎదురు చూస్తోంది!

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న గోదావరి కరకట్ట నిర్మించాలని, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 15, 2025
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.

కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్‌పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.