News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సంగారెడ్డి జిల్లా ఎదురుచూస్తోంది..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మంజీరా నదిలో నక్క వాగు నీళ్లు కాలుష్యం కాకుండా చూడాలి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి. ప్యారానగర్ డంప్ యార్డు రద్దు చేయాలి. సింగూరు జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.
Similar News
News March 15, 2025
NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
News March 15, 2025
కర్నూలు జిల్లాలో 393 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.
News March 15, 2025
HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.