News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సిద్దిపేట జిల్లాకు ఇవి కావాలి..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరి సిద్దిపేటకు నిధులు కేటాయిస్తారా.. చూడాలి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టూరిజం స్పాట్ శిల్పారామం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద బీచ్, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, పశువుల వైద్య కాలేజీల్లో పెండింగ్ పనులతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగనాయక సాగర్ డ్యాం వద్ద ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. యువతకు ఉపాధి కల్పించాలి.
Similar News
News February 10, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మరింత బలోపేతం కావాలి: సీఎం

రాష్ట్రంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపడిందని, ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లతో సోమవారం వర్చువల్ సమావేశం జరగ్గా జిల్లా నుంచి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మార్చి లోగా పూర్తిగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు సేవలు వేగంగా అందేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
News February 10, 2026
పెరిగిన తిరుపతి కార్పొరేషన్ బడ్జెట్

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ఎస్వీయూ సెనేట్ హాలులో మంగళవారం జరగనుంది. గత ఏడాది రూ. 272 కోట్లు కాగా ఈ ఏడాది అత్యధికంగా పెరిగి రూ. 351 కోట్లకు అంచనా వేశారు. 2025-26లో రెవెన్యూ ఆదాయం రూ.170 కోట్లు కాగా రూ. 178 కోట్లు వచ్చింది. ఈ ఏడాది కూడా అంచనాకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన మార్గాలను సూచిస్తూ కౌన్సెలింగ్ ద్వారా ఆమోదం పొందనున్నారు. అనంతరం అజెండా పై చర్చ జరగనుంది.
News February 10, 2026
పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు బాధితులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి డీఎస్పీ వెంకటరమణ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.


