News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. హనుమకొండ జిల్లాకు ఏం కావాలంటే?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ-సేకరణ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. WGL కలెక్టరేట్ పనులు, నూతన బస్టాండ్ పనులు, టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

Similar News

News October 20, 2025

నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం: కెనడా ప్రధాని

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తమ దేశంలో అమలు చేస్తామని కెనడా పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. నెతన్యాహు తమ దేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధ నేరాలకు గాను 2024 నవంబర్ 21న నెతన్యాహుపై ICC అరెస్ట్ <<14671651>>వారెంట్ జారీ <<>>చేసిన విషయం తెలిసిందే.

News October 20, 2025

పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వీరేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.

News October 20, 2025

దీపావళి వేడుకల్లో సీఎం దంపతులు

image

AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు ట్వీట్ చేశారు.