News March 10, 2025

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం

image

తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, BRS కార్యక్రమాలు, బీఆర్ఎస్ ఆవశ్యకతపై వివరణాత్మకంగా మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ సమావేశంలో మహిళా సంఘాలకు, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన మాటలకు పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 19, 2026

HYD: మున్సి‘పోల్’కు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు ఖరారు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను గాంధీభవన్ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని పార్లమెంట్ స్థానాలైన చేవెళ్లకు శ్రీధర్‌బాబు, మల్కాజిగిరికి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరికి సీతక్క పేర్లను ఖరారు చేసింది.

News January 19, 2026

మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

image

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.

News January 19, 2026

హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.