News January 26, 2025
తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.
Similar News
News December 4, 2025
బత్తాయిలో ‘తొడిమ కుళ్లు’ తెగులు – లక్షణాలు

బత్తాయి తోటలను కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశిస్తుంది. కాయ పక్వానికి రాకముందే తొడిమ నుంచి ఊడి రాలిపోవటం ఈ తెగులు ప్రధాన లక్షణం. ఈ కాయలను పరిశీలిస్తే వాటికి తొడిమ ఉండదు. ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా వున్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువ. వర్షాలు, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.
News December 4, 2025
ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!
News December 4, 2025
VZM: ఘంటసాల సంగీతం నేర్చుకున్నది ఇక్కడే..

శతాబ్ది గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పుట్టింది గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామమైనా ఆయన ప్రస్థానానికి విజయనగరం నుంచే అడుగులు పడ్డాయి. నగరంలోని సంగీత కళాశాలలో 1936 నుంచి సంగీతం నేర్చుకుని పట్టా అందుకున్నారు. 1942 వరకు ఇక్కడే ఉంటూ సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ పొందారు. ఆయన గుమ్చి దగ్గర ఉంటూ సాధన చేసేవారు. నేడు ఆయన జయంతి.


