News January 26, 2025
తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.
Similar News
News July 11, 2025
‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ 5.27 గంటలు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.
News July 11, 2025
అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.
News July 11, 2025
సత్తెనపల్లి: విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి శుక్రవారం సత్తెనపల్లి పీఎస్‌కు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన నెపంతో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సత్తెనపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. నేడు ఉదయం 11 గంటలకి సత్తెనపల్లి అర్బన్ పీఎస్‌లో విచారణకు రావాలని అంబటికి నోటీసులు జారీ చేశారు.