News April 8, 2025
తెలంగాణ భవన్లో BRS ముఖ్యనేతల మీటింగ్

బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో నేడు BRS ముఖ్యనాయకుల సమావేశం జరగనున్నట్లు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
అరకు: కాఫీ బెర్రీ బోరర్ నివారణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి నివారణకు కలెక్టర్ దినేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షికంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి బయటికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని గురువారం అరకు పర్యటనలో ఆదేశించారు. అరకు డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లో కాఫీ కొనుగోలు, అమ్మకాలకు నియంత్రణ విధించారు. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు కాఫీ కొని అమ్మడాలను తాత్కాలికంగా నిషేధించారు.
News November 20, 2025
HYD: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పేట్ బషీరాబాద్లో నివాసం ఉండే కుమ్మరి ప్రణయ(29) భర్తతో గొడవల కారణంగా ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. రాత్రి ఇంట్లో గొడవల కారణంగా తీవ్ర మనస్తపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.