News March 8, 2025
తెలంగాణ భవిష్యత్తు మహిళలే: మంత్రి పొన్నం

తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు మహిళలే మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X’లో పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మహిళ శక్తికి దీరత్వం,వీరత్వం మాతృత్వం కలిగిన ఒక దృఢమైన బలం అని కొనియాడారు. మహిళ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతూ తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. మహిళా సాధికారత దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
జిల్లావ్యాప్తంగా 620 వార్డులు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు వెల్లడించారు.


