News December 20, 2024
తెలంగాణ భావజాలంపై రేవంత్ దాడి: మధుసుదన్

రాష్ట్రం సాధించి, పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కుట్రకేసులకు రేవంత్ రెడ్డి తెరతీస్తున్నారని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్, కేటీఆర్కు కేసులు కొత్తేమి కాదని పేర్కొన్నారు. కేసులలో భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు.
Similar News
News October 16, 2025
నిజామాబాద్: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్లో కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులతో పాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని సూచించారు.
News October 15, 2025
NZB: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు: కలెక్టర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
News October 15, 2025
భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి మాట్లాడారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.