News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

Similar News

News November 28, 2025

కల్వకుర్తి: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు.. ఇదీ ఆయన ప్రస్థానం

image

కల్వకుర్తి నియోజకవర్గంలోని చల్లంపల్లి గ్రామానికి చెందిన జైపాల్ యాదవ్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి కొనసాగి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. 1981 నుంచి 95 దాకా గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత 1986లో టీడీపీలో చేరి 1995లో తలకొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు BRS ఎమ్మెల్యేగా గెలిచారు.

News November 28, 2025

ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

image

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.

News November 28, 2025

MDK: సమయం తక్కువ.. సోషల్ మీడియాపై మక్కువ

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2 ఏళ్లుగా గ్రామాల్లో సర్పంచ్ లేకపోవడంతో పాలన కుంటుబడగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున మళ్లీ పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల తేదీలు దగ్గర ఉండటంతో ప్రచారానికి సమయం లేక గ్రామాల్లో ఉండే ఆశావాహులు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రూపులు క్రియేట్ చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో హామీలు ఇస్తున్నారు.