News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

Similar News

News March 21, 2025

జీవనోపాధికి వెళ్లి కువైట్‌లో గుండెపోటుతో మృతి

image

జీవనోపాధికి కువైట్ వెళ్లిన సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్ (34) ఈ నెల 18న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో కారు డ్రైవర్‌గా పని చేసేందుకు సాగర్ కువైట్ వెళ్లారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ గత ఏడాది జులైలో కువైట్ వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

News March 21, 2025

అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

image

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

News March 21, 2025

రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

image

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

error: Content is protected !!