News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.
Similar News
News March 19, 2025
సునీత విలియమ్స్ నేటి తరానికి స్ఫూర్తి: మంత్రి సుభాష్

భారత సంతతి హ్యోమగామి సునీత విలియమ్స్ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉండటం సాధరణ విషయం కాదని ఆమెను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకొవాలని సూచించారు.
News March 19, 2025
MBNR: ‘బీసీ బిల్లు బీసీ సంఘాల ఐక్య పోరాట ఫలితమే’

రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం బిల్లు బీసీ రాజ్యాధికారానికి తొలిమెట్టు అని బీసీ సమాజ్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీని అమలు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
News March 19, 2025
SRH జెర్సీలో మహ్మద్ షమీ.. పిక్ వైరల్

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.