News February 26, 2026
తెలంగాణ వర్సిటీ ‘ప్రజావాణి’ నోడల్ ఆఫీసర్‌గా రమణాచారి

తెలంగాణ యూనివర్సిటీ సీఎమ్ ప్రజావాణి (రెడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్) నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ రమణాచారి నియమితులయ్యారు. వీసీ ఆచార్య యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి గురువారం ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఆయన కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్‌గా, పీఆర్వోగా కొనసాగుతున్నారు. ఆయన నియామకం పట్ల వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.