News August 6, 2024
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్!

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ HNK జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందినవారు. ఆగస్టు 6వ తేదీ 1934లో జన్మించి, 21 జూన్ 2011లో మరణించారు. గతంలో కేయూ వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలకపాత్ర పోషించారు. జయశంకర్ సార్ పేరిట భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.