News April 9, 2025

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనకు MNCL వాసి చిత్రం

image

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు మంచిర్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చిప్పపూర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపికైంది. ఆయన వేసిన చిత్రం 3రోజులపాటు (ఈనెల 12నుంచి 14వరకు) ప్రదర్శనలో ఉంచనున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాకతీయ శిల్ప సంపదపై ఉన్న అభిమానానికి తాను వేసిన చిత్రం ఎంపికకావడం గర్వకారణంగా ఉందన్నారు. అవకాశం ఇచ్చిన నిర్వాకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 21, 2025

వరంగల్ నిట్‌లో ప్రారంభమైన వెల్నెస్ సెంటర్

image

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నిట్‌లో వెల్నెస్ సెంటర్ ప్రారంభమైంది. మంగళవారం నిట్ డైరెక్ట ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం, యోగాభ్యాసం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి పద్ధతులను విద్యార్థులు, అధ్యాపకుల దైనందిన జీవితంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం అన్నారు.

News October 21, 2025

మంథని: ఈనెల 24న రాజకీయ శిక్షణా శిబిరం

image

ఈనెల 24న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథనిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

News October 21, 2025

మురిపించని ‘మూరత్’.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు!

image

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ సెషన్ పెద్దగా మురిపించలేదు. మొదట లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల స్వల్ప లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్‌గా ట్రేడ్ అవగా, కొటక్ మహీంద్రా, ICICI బ్యాంకులు, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.