News October 23, 2024
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌కు చుక్కెదురు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాశ్, తండ్రి భాస్కర్ రెడ్డి తమ మధ్యంతర బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు విదేశాలకు వెళ్లవద్దని కండిషన్ పెట్టారు. కండిషన్ తొలగించామని కోరగా కోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్డుకు వెళ్లామని వారికి కోర్డు సూచించింది.
Similar News
News July 9, 2025
ముద్దనూరులో యాక్సిడెంట్

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
News July 9, 2025
Y.S జగన్‌కు మరో పదవి

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.
News July 9, 2025
కడప అభివృద్ధిపై జిల్లాస్థాయి సమావేశం

కడప కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. కడప మరింత వేగంగా అభివృద్ధి చెందేలా కార్యాచరణను సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి తదితరులు ఉన్నారు.