News October 1, 2024

తెలంగాణ DSCలో పలమనేరు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్

image

తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ-24 ఫలితాలలో పలమనేరుకు చెందిన తహసీనా ప్రతిభ చూపింది. తహసీనా 75.57 శాతం మార్కులతో ఉర్దూ మీడియంలో తొలి ర్యాంకు సాధించింది. విద్యార్థిని తండ్రి సుందర్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ టాపర్‌గా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.

Similar News

News October 1, 2024

తిరుపతి: చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, MLA

image

తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ లో స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News October 1, 2024

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలు పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఆలయం వెలుపల టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

News October 1, 2024

వెదురుకుప్పం: బొమ్మయపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

image

వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి సర్పంచి గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని డీపీవో, కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.