News November 4, 2024
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కైవల్య రెడ్డికి స్థానం
నిడదవోలుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న కుంచాల కైవల్యరెడ్డి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో నాసావారి ఆధ్వర్యంలో ఎక్స వారు నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసిన అతి చిన్న వయస్కురాలైన భారతీయురాలిగా రికార్డు నమోదు చేసింది. సైన్స్, చిత్రలేఖనంలో ప్రతిభ చూపింది.
Similar News
News December 11, 2024
కొవ్వూరు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
కొవ్వూరు శ్రీరామ కాలనీకి చెందిన నేతల వీరబాబు భార్య నేతల దేవి (21) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు భర్తకు ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్పగా చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చిన భర్తకు దేవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనబడుతుంది. స్థానికులు పోలీసులకు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
News December 11, 2024
పనులు త్వరగా పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్
డిసెంబర్ 13న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా శాఖల వారీగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ మొత్తం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.
News December 11, 2024
తినుబండారాల్లో కల్తీ జరుగుతుంది: జేసీరాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం కలెక్టరేట్లో పాన్ ఇండియా పోస్టాక్ అనే అంశంపై బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క తినుబండారాల్లో కల్తీ జరుగుతుందని అన్నారు. పట్టణంలో హోటల్స్, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, టీ స్టాల్స్, తదితర వ్యాపారులకు అవగాహన కల్పించారు.