News April 7, 2025

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

image

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.

Similar News

News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2025

వరంగల్: ప్రజావాణికి 93 దరఖాస్తులు

image

వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద దేవి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల నుంచి 93 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సమస్యలపై 41, మిగతా శాఖల నుంచి 52 వచ్చాయి. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!