News April 7, 2025
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.
Similar News
News April 22, 2025
పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
News April 22, 2025
జన సమీకరణలో బిజీ.. బిజీ

27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం నుంచి 50 నుంచి 60 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. MP రవిచంద్ర, MLC తాతా మధుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులగా ఉన్నారు. జనసమీకరణలో వారు బీజీ అయ్యారు. MLC కవిత నేతలతో సమామేశమై సభకు జనాన్ని భారీగా తరలించాలని దిశ నిర్దేశం చేశారు. అధికార పార్టీ బలాన్ని అధిగమించి వీరు ఎంతవరకు జన సమీకరణ చేస్తారనేది ఆసక్తి నెలకొంది.
News April 22, 2025
పాలమూరు: భూభారతి చట్టంలో కొన్ని వివరాలు..

✓ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేస్తారు. ✓అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దవుతాయి.✓భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేయవచ్చు.✓దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే కూడా అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది.