News August 27, 2024

తెలుగు భాషా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 29న కలమల్లలో తెలుగు భాషా దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఈ వేడుకలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి తెలుగు శాసనాలు అభ్యమైన కలమల్ల గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించున్న, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఎలాంటి కొరత లేకుండా జయప్రదం చేయాలన్నారు.

Similar News

News October 26, 2025

జమ్మలమడుగులో భార్యాభర్తలు దారుణ హత్య

image

జమ్మలమడుగు- తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఇటికల బట్టి వద్ద కాపలాగా ఉన్న నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడులు చేయడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 26, 2025

కడప జిల్లా ప్రజలకు గమనిక

image

కడప జిల్లాలో వాతావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదితి సింగ్ ఆదివారం తెలిపారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

News October 26, 2025

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.