News August 7, 2024

తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడుకుందాం: శబరి

image

ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈక్రమంలో నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని సత్కరించారు. తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడుకునేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా ఏపీకి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Similar News

News October 23, 2025

3వ విడత రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి: సీసీఎల్ఏ

image

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం ఇళ్లు లేని వారికి ఇళ్లు కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు. 3వ విడత రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ సంబంధిత సమస్యలను సమీక్షించాలని సూచించారు. దీనికి సంబంధించిన నివేదిక సమర్పిస్తామని కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు.

News October 22, 2025

2 కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు: జిల్లా జడ్జి

image

రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల కలెక్టర్‌లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.

News October 22, 2025

చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.